నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 23 2026 1:36 AM | Updated on Jul 23 2026 1:36 AM

గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026 8లోu

ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అవకాశం కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్న టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది.

దూరవిద్య.. చదువుకు దగ్గర

చదువు మధ్యలో మానేసినవారిలో ఓపెన్‌ స్కూల్‌ విధానం కొత్త ఆశలు నింపుతోంది. స్వీయ అధ్యయనంతోపాటు అనుకూల సమయంలో పరీక్షలు రాసే వెసులుబాటు దక్కనుంది.

జై.. జగన్నాథా..

జగన్నాథుని నామస్మరణతో బుధవారం జిల్లా కేంద్రం మార్మోగింది. గాంధీచౌక్‌లోని మురళీకృష్ణ ఆలయం నుంచి నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ప్రధాన వీధులు జనసంద్రంగా మారాయి. నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా రథం ముందు చీపుర్లతో ఊడుస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర గాంధీ చౌక్‌ మురళీకృష్ణ ఆలయం నుంచి ప్రారంభమై బుధవార్‌పేట్‌, పాత బస్టాండ్‌, వివేకానంద చౌక్‌, జయశంకర్‌ చౌక్‌, నగేశ్వరవాడ, చింతకుంటవాడ, టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా కొనసాగింది. దీంతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, నాయకులు రావుల రాంనాథ్‌, ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – నిర్మల్‌టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement