అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Jul 23 2026 1:36 AM | Updated on Jul 23 2026 1:36 AM

దస్తురాబాద్‌: వర్షాలు కురుస్తున్నందున విద్యుత్‌ వి నియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఖానా పూర్‌ ఇన్‌చార్జి ఏడీఈ శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం మండలంలోని మున్యాల గ్రామంలో ఇనుప స్తంభాలు తీసివేసి నూతనంగా వేస్తున్న స్తంభాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున తడి చేతులతో విద్యుత్‌ వైర్లను ముట్టవద్దని, దుస్తులు ఆరవేసే దండాలను వైర్లకు దూరంగా క ట్టాలని, విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో నెలకొ న్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలి పారు. గ్రామాల్లో విద్యుత్‌ పనులు చేపట్టినప్పుడు వినియోగదారులు సహకరించాలని సూచించారు. ఇన్‌చార్జి ఏఈ శ్రావణ్‌, సిబ్బంది సత్యనారాయణ, ప్రేమ్‌, నవీన్‌రెడ్డి, రాజేశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement