నిర్మల్‌చైన్‌గేట్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజేందర్ సూచించారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి గురించి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగీ, చికున్ గున్యా, డయేరియా, డీసెంట్రీ మొదలైన వ్యాధులు వ్యాపించే అవకాశముందని, క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ శుక్ర, మంగళవారాల్లో డ్రైడే పాటించాలని, ఫీవర్ స ర్వే నిర్వహించాలని, అధికంగా వ్యాధులు ప్రబ లిన ప్రాంతాల్లో ఆరోగ్యశిబిరాలు నిర్వహించా లని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరో గ్యకేంద్రాల వారీగా వివిధ ఆరోగ్య కార్యక్రమా ల లక్ష్యాలు, వారు సాధించిన ప్రగతిని సమీక్షించారు. లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్య ల గురించి వివరించారు. కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్ నయనారెడ్డి, డాక్టర్ రాజారమేశ్, డాక్టర్ రాకేశ్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ పవన్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆకాశ్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.


