దిలావర్‌పూర్: కాలంతో పోటీపడి లక్ష్య సాధన కు నిరంతరం సాధన చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను బుధవారం సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అన్ని గ్రూపుల వారికి మొదటి సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే కళాశాలలో పురోగతి సాధించి అధ్యాపకులు, ప్రన్సిపాల్ సుదర్శన్‌ను అభినందించారు.


