తానూరు: సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవా రం తానూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళ పో లీసులతో పెట్రోలింగ్ మమ్మరంగా నిర్వహించి అ వాంఛనీయ ఘటనలు, చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గతంలో పోలీస్‌స్టేష న్‌లో నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని రికా ర్డులు పరిశీలించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. మహారాష్ట్రకు సరిహద్దులోని గ్రామాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని దుకా ణా సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లా చూడాలని పేర్కొన్నారు. బోల్సా గ్రామానికి చెందిన ఫిరాజీ భూ విషయంలో ఆత్మహత్యకు పా ల్పడగా అతడి కుటుంబ సభ్యులు ఎస్పీ జానకీ షర్మి లను కలిసి భూ సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నా టి నీరు పోశారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ము థోల్ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై షేక్ జుబేర్, స ర్పంచ్ సుగంధ, ఉపసర్పంచ్ షారూక్ పాల్గొన్నారు.
సత్వర న్యాయం అందించాలి
భైంసాటౌన్: పోలీస్‌స్టేషనకు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై డివిజన్ పరిధిలోని వి విధ గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని ఎస్‌హెచ్‌వోలను ఫోన్‌లో ఆదేశించారు. షీటీం నిర్వహిస్తున్న భరోసా కేంద్రాన్ని సందర్శించి ఇరు కుటుంబాలు కౌన్సిలింగ్ ద్వారా తి రిగి కలుసుకునేలా చర్యలు తీసుకోవడంతో సంతృప్తి వ్యక్తంజేశారు. పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.


