వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jul 20 2026 11:42 PM | Updated on Jul 20 2026 11:42 PM

వాతావరణం ● పంపిణీకి అధికారుల ఏర్పాట్లు 9లోu

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

‘వాల్టా’కు తూట్లు

తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఏటా వన మహోత్సవం నిర్వహిస్తోంది. కొందరు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ చెట్లను నరికేస్తున్నారు.

మళ్లీ మూడు నెలల రేషన్‌..!

భైంసాటౌన్‌: తెల్ల రేషన్‌కార్డు దారులకు మరోమారు మూడునెలల బియ్యం పంపిణీ ఒ కేసారి చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించి కోటాను వచ్చే నెల 1 నుంచి అందించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందిన ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడునెలల రేషన్‌ బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, నిల్వ సమస్యల దృష్ట్యా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సైతం మూడునెలల రేషన్‌ ఒకేసారి పంపిణీ చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించి ఏప్రిల్‌ నెలలోనే బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలాఖరు వరకు రేషన్‌ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు.

పూర్తయిన జూలై కోటా..

జిల్లాలో 412 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. జూలై నెలకు సంబంధించి రేషన్‌ బియ్యం పంపిణీ ఈనెల 18తో పూర్తయింది. జిల్లాలోని తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రతినెలా 4867.168 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అందిస్తున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ నేపథ్యంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం సరఫరా, ఎప్పటికప్పుడు రేషన్‌ డీలర్లు, అక్కడి నుంచి లబ్ధిదారులకు ఒకేసారి బియ్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆదేశాలు రాలేదు...

మూడు నెలలకు సంబంధించి రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేషన్‌ కార్డుదారులకు బియ్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.

– రాజేందర్‌, డీసీఎస్‌వో, నిర్మల్‌

జిల్లా వివరాలు

జిల్లాలో రేషన్‌కార్డులు : 2,49,606

ఎఫ్‌ఎస్‌సీ కార్డులు : 2,36,562(6 కేజీలు)

ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు : 13,012(35 కేజీలు)

అన్నపూర్ణ కార్డులు : 32(10 కేజీలు)

మొత్తం లబ్ధిదారులు : 7,74,020

నెల బియ్యం కోటా : 4,867.168 మె.ట

మూడు నెలలకు

(దాదాపు) : 14,601.504 మె.ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement