అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశానికి అటవీశాఖ అధికారులు హాజరుకాకపోవడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉమ్మడి జిల్లాలో పోడు సమస్య, మరోవైపు గిరిజనుల ఇళ్ల నిర్మాణాలను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమస్యలపై చర్చించేందుకు రాకపోవడం సరికాదన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైపులైన్ లీకేజీలు వెంటనే మరమ్మతు చేసి నీటి వృథా అరికట్టాలని సూచించారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొజ్జు


