జిల్లా కేంద్రానికి చెందిన విహారి స్థానిక దీక్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డాటాసైన్స్ పూర్తి చేసింది. ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉన్నా ఇందులో పీజీతో పాటు అదనపు కోర్సులు చేస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పీజీ కోర్సులు అందుబాటులో లేవు. సాధారణ కుటుంబం కావడం, ఆర్థిక పరిస్థితులూ తనను హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. అదే.. నిర్మల్‌లోనే పీజీకోర్సులు అందుబాటులో ఉంటే తనలాంటి ఎంతోమంది విద్యార్థినులు కంటున్న కలలు సాకారం అవుతాయని విహారి ఆవేదన వ్యక్తం చేస్తోంది


