‘ఇన్‌స్పైర్‌’చేస్తే ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్పైర్‌’చేస్తే ప్రోత్సాహకం

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

● 2022–23లో జిల్లా స్థాయికి 134 ప్రాజెక్టులు ఎంపిక కాగా, వాటిలో 13 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వీటిలో మామడ మండలంలో ని అనంతపేట్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి నేషనల్‌ స్థాయికి ఎంపికయ్యాడు. ● 2023–24లో జిల్లా స్థాయికి 125 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో 13 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి వెళ్లాయి. అయితే నేషనల్‌ స్థాయికి ఎవరూ ఎంపిక కాలేదు. ● 2024–25లో జిల్లా స్థాయికి 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో 12 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి వెళ్లాయి. భైంసా పణంలోని ఆల్ఫోర్స్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్నవ్‌ తయారు చేసిన ప్రాజెక్టు నేషనల్‌ స్థాయికి ఎంపికయింది. ● 2025–26లో జిల్లా స్థాయిలో 84 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయి, అనంతరం జాతీయ స్థాయి ఎంపికలు వచ్చే నవంబర్‌ నెలలో జరగనున్నాయని జిల్లా సైన్స్‌ అధికారి డా. వినోద్‌ కుమార్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఎంపికై న విద్యార్థులకు నగదు పురస్కారాలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థి ఆర్నవ్‌. భైంసాలోని అల్ఫోర్స్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్నవ్‌ 2024–25లో తయారు చేసిన స్మార్ట్‌ వీల్‌చైర్‌ ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ వీల్‌చైర్‌ శారీరక వై కల్యం ఉన్న వ్యక్తులకు, వృద్ధులకు, రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వైకల్యం ఉన్నవారి జీవితాన్ని సులభతరం చేయడానికి రూపొందించిన వినూత్న సాంకేతిక పరిష్కారం. ఇతనికి రూ.30 వేలు వచ్చాయి.

లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను శాస్త్ర సాంకేతిక, విజ్ఞానరంగాలవైపు మళ్లించడానికి ఏటా ఇన్‌స్పైర్‌ మనక్‌ పేరుతో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏటా జిల్లా స్థాయిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల ప్రాజెక్టులు పంపిస్తున్నా, ఈసారి వినూత్నమైన, ప్రజలకు, రైతులకు, ఇతర రంగాలకు ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాలని, అందుకు సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.

వీరు అర్హులు..

10 నుంచి 17 ఏళ్ల వయసు ఉండి, 6 నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులకు అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుల సహకారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ పాఠశాల నుంచి గరిష్టంగా 5 నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు జిల్లా నుంచి ఎంపికలు

దరఖాస్తు విధానం, చివరి తేదీ

ఇన్‌స్పైర్‌ మనక్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https: //www.inspire.gov.inలోకి వెళ్లి ‘న్యూ రిజిస్ట్రేషన్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దరఖా స్తులకు చివరి తేదీ సెప్టెంబర్‌ 15 అని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement