నిర్మల్‌టౌన్: ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


