జల్లులేనా..! | - | Sakshi
Sakshi News home page

జల్లులేనా..!

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

● ఎల్‌నినోతో భారీ వర్షాలపై అనిశ్చితి ● ఇప్పటికే 138.2 మి.మీ లోటు వర్షపాతం ● అధికారులు చెబుతున్నా.. వరిపై ఆశలు బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

ఎత్తిపోయిన సోయా, పత్తి పంటలు

హరి ఓం విఠల..!

ఏటా ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు పండరీపూర్‌కు పాదయాత్రగా వెళ్తుంటారు. మార్గమధ్యలో భజనలు ఆలపిస్తూ.. పాండురంగడి భక్తిలో మైమరచిపోతారు.

డాగ్‌స్క్వాడ్‌ సేవలు అమూల్యం

నిర్మల్‌టౌన్‌: నేరాల దర్యాప్తులో డాగ్‌స్క్వాడ్‌ అందించే సేవలు అమూల్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్‌న్స్‌ విభాగం విడుదల చేసిన 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదికలో జిల్లా పోలీసు శునక దళం అత్యుత్తమ పనితీరుకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. జనవరి నుంచి జూన్‌ వరకు హత్యలు, అనుమానాస్పద మృతులు, చోరీలు, మాదకద్రవ్యాల కేసులతో పాటు పలు కీలక కేసుల దర్యాప్తులో పోలీసు శునకాలు యామి, జెస్సీ, బోల్ట్‌ కీలక ఆధారాలను గుర్తించి నిందితుల జాడ కనిపెట్టడంలో సహకరించాయి. ఈ సందర్భంగా శునకాలతో సమన్వయంగా విధులు నిర్వహించిన ఏఆర్పీసీలు జి.పరమేశ్వర్‌, కె.శ్రీనివాస్‌, జి.సాయేందర్‌కు మంగళవారం ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ కృష్ణ, డాగ్‌స్క్వాడ్‌ ఇనన్‌చార్జి ఆర్‌ఐ శేఖర్‌, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నిర్మల్‌: జిల్లాలో మూడు, నాలుగు రోజు లుగా ముసురు పట్టింది. నల్లమబ్బులు కమ్ముకుంటున్నా.. భారీ వానలు మాత్రం కురవడం లేదు. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తుండడంతో చల్ల ని వాతావరణం ఏర్పడినా, వ్యవసాయానికి మాత్రం పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. పడుతున్న వర్షం నేలను తడిపిందే తప్ప చెరువులు, కుంటలు, వాగులు నిండే పరిస్థితి లేదు. దీంతో రైతులు మబ్బులతో నిండిన ఆకాశం వైపు భారీ వర్షాల కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ ఉన్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం ఇంకా వరిపై ఆశలు వదలడం లేదు.

చెరువుల్లోకి

చేరని నీరు

ముసురు పెట్టి కురుస్తున్న వర్షపునీరు భూమిలో ఇంకిపోతోంది. కానీ చెరువులు, కుంటలు, వాగుల్లోకి ప్రవహించేంత తీవ్రత లేకపోవడంతో జలాశయాల్లో నీటినిల్వలు పెరగడం లేదు. జిల్లాలోని చాలా చెరువులు ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటి సమస్య తీవ్రం కావచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ చెరువుల కింద సాగుచేస్తున్న రైతులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే.. మరో రెండు మూడు నెలల్లో నీటికి ఎంత ఇబ్బంది అవుతుందోనన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.

విస్తారంగా కురిస్తేనే..

వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం చిరుజల్లులు మొక్కలకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, పంటలు బాగా ఎదగాలంటే ఒకటి రెండురోజుల పాటు విస్తారంగా కురిసే వర్షాలు అవసరం. ముఖ్యంగా పత్తి, సోయాబీన్‌ పంటల కాలం ఎత్తిపోయింది. గత నెలలో వేసిన చోట ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉండటంతో తగినంత తేమ లేకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.

లోటు వర్షపాతం..

గతేడాది జూన్‌, జూలై మాసాల్లో మొత్తం 376 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది ఈనెల 19 నాటికి కేవలం 237.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 138.2 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం కురిసింది. మిగిలిన రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పెంబి మండలం మినహా మిగిలిన 18 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. పెంబిలో మాత్రం సాధారణం కంటే ఒక్కపాయింట్‌ ఎక్కువ నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు జల్లులు పడుతుండగా, ఎక్కువ ప్రాంతాల్లో ముసురు వాతావరణమే కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే విత్తిన పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న పంటలకు తగినంత తేమ అందడం లేదు. కొన్నిచోట్ల రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు వేయడానికే వెనుకాడుతున్నారు.

గతేడాదితో పోలిస్తే..

2025 జూన్‌లో 141.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 147.3 మి.మీ. వర్షం కురిసింది. అంటే గతేడాది కంటే 6 మి.మీ. ఎక్కువే కురిసింది. జూలై వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. గత జూలై నెలాఖరుకు 234.7 మి.మీ. వర్షపాతం నమోదుకాగా ప్రస్తుతం ఈ నెల 19 వరకు 90.5 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. ఈలెక్కన ఇప్పటికే 144.2 మి.మీ. తక్కువ వర్షం కురిసింది. జూన్‌లో గతేడాది కంటే స్వల్పంగా ఎక్కువ వర్షం కురిసినా, జూలైలో ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి పూర్తిగా మారింది. నెల సగం దాటినా సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాకపోవడంతో జిల్లాలో 48 శాతం లోటు ఏర్పడింది. గతేడాది జూలైలో ఇదే సమయానికి నమోదైన స్థాయికి కూడా చేరుకోకపోవడం గమనార్హం.

ఇంకా ఆశల్లో రైతన్న..

‘ఒక్క మంచి వాన పడితే సాలు.. పంటలు ఊపిరి పోసుకుంటాయి..’ అంటూ చాలామంది రైతులు ఇంకా ఈ సీజన్‌పై ఆశలు పెట్టుకునే ఉన్నారు. ఆగస్టులో వర్షం వస్తుందని, చెరువులు కూడా కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రైతుల్లో చాలామంది ఇప్పటికీ వరిసాగు దిశగా ఆలోచిస్తుండడం గమనార్హం. కలెక్టర్‌, అధికారులు ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి వద్దని చెబుతున్నా.. ‘అది తప్పా ఏదీ పండనప్పుడు ఏం చేయాలె..’అంటూ వరిసాగుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ఇప్పటివరకు ఒక్క భారీవర్షం కూడా నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖరీఫ్‌ సాగుపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో ..

2025–26 వర్షపాతం తేడా (మిల్లిమీటర్లలో)

నెల 2025 2026 తేడా

జూన్‌ 141.3 147.3 +6.0

జూలై 247.7 90.5 –144.2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement