వెంటాడుతున్న జ్వరాలు వాతావరణంలో మార్పులు, కలుషిత నీరే కారణం జనరల్ ఆస్పత్రిలో పెరుగుతున్న ఓపీ, ఐపీ కేసులు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో సీజనల్ వ్యాధులు క్రమంగా విజృంభిస్తున్నాయి. వర్షాకా లం ప్రారంభం కావ డం, వాతావరణంలో మార్పుల ప్రభా వంతో జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురో జుకూ పెరుగుతోంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో జ్వరపీడితులు వస్తున్నారు. వారం రోజులుగా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఓపీ విభాగంలో రద్దీ నెలకొంటోంది. మున్ముందు సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
రోజుకు 1200కు పైగా ఓపీ..
ప్రస్తుతం జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య కూడా పెరిగింది. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఈ నెల ప్రారంభం నుంచి రోజుకు 1200కు పైగా ఓపీ కేసులు వస్తున్నాయి. ఇందులో 400 మందికి పైగా జ్వర బాధితులే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యే సమయానికంటే ముందుగానే వచ్చి రోగులు క్యూ కడుతున్నారు. దీంతో ఓపీ విభాగంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
విద్యార్థులూ.. జర జాగ్రత్త!
జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటూ.. చదువుకునే విద్యార్థులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా సంబంధిత వార్డెన్లు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పరిశుభ్రమైన ఆహారం, తాగునీటితో పాటు పరిసర ప్రాంతాలు, నిద్రించే గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
దోమలను నివారించాలి..
వ్యాధుల వ్యాప్తి అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరాల కోసం ఇంటి పరిసరాల్లో సిమెంట్ కుండీల్లో నీ రు నిల్వ చేసుకుంటారని, ప్రస్తుత సీజన్‌లో అది ప్ర మాదకరమని హెచ్చరిస్తున్నారు. నిల్వ నీరు మూ డురోజుల్లో పారబోయకుంటే వాటిలో దోమలు గు డ్లు పెట్టే ప్రమాదం ఉంటుంది. దీంతో అవి వృద్ధి చెంది మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యా ధులకు కారణమవుతాయి. కూలర్లలో నీటిని అలా గే ఉంచినా, పాత టైర్లు, వాడి పడేసిన కొబ్బరిబొండాల్లో నీరున్నా దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యా ప్తికి కారణమవుతాయి. ఇంటి పరిసరాల్లో గుంతలు ఉండకుండా చూసుకోవాలి. కలుషితమైన నీటితో డయేరియా వంటి వ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ సీజన్‌లో పరిశుభ్రమైన నీరు, తాజాగా వండిన ఆహార పదార్థాలు తీసుకుంటేనే మంచిది.
డయేరియా లక్షణాలు
రోటా వైరస్ వల్ల డయోరియా వ్యాపిస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం వంటివి ఉంటాయి. దీని నివారణకు ఓఆర్‌ఎస్, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం..
వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అలాంటి కేసులే ఆస్పత్రుల్లో పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. రోడ్లపై ఉండే అల్పాహారం తీసుకోవద్దు. ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
– డాక్టర్ కాశీనాథ్, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకులు
వారం రోజులుగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓపీల వివరాలు
తేదీ ఓపీలు
13 1300
14 1100
15 1078
16 1190
17 1180
18 1000
20 1280
జ్వరాల లక్షణాలివే..
ఎడిస్ అనే దోమ వల్ల డెంగీ వ్యాపిస్తుంది. ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. చలితో కూడిన తీవ్రమైన జ్వరం, కీళ్ల, ఒంటినొప్పులు అధికంగా ఉంటాయి. ఆడ అనాఫిలస్ దోమ వల్ల మలేరియా వ్యాపిస్తుంది. తరచూ జ్వరం రావడం, చలి, తలనొ ప్పి ఉంటాయి. చికున్ గున్యాకు కూడా డెంగీ లక్షణా లే ఉంటాయి. టైఫాయిడ్ సాల్మొ నెల్లాటైఫీ అనే బ్యా క్టీరియా ద్వారా సోకుతుంది. ఇది నోటి ద్వారా వ్యా ప్తి చెందుతుంది. ఈగలు వాలిన ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. కలుషిత నీటివల్ల కూడా వస్తుంది.


