‘రాహుల్‌గాంధీ అరెస్టు అక్రమం’ | - | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌గాంధీ అరెస్టు అక్రమం’

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

నిర్మల్‌: రాహుల్‌ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని, కేంద్రంలోని బీజేపీ ప్రజాగొంతుకలను అణచివేస్తోందని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌, శివాజీ చౌక్‌లలో మంగళవారం రాత్రి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐకేరెడ్డి మాట్లాడుతూ ప్రజల తరపున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, వైస్‌చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌అలీ, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మ న్‌ ధర్మాజీ రాజేందర్‌, ఆకుల హరీశ్‌, రాజేశ్వర్‌రెడ్డి, రమణారెడ్డి, మతిన్‌, జునైద్‌, నర్సింహారె డ్డి, సత్యనారాయణ, చిన్ను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement