హమాలీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

నిర్మల్‌టౌన్‌: సివిల్‌ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేష్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏఐటీయూసీ అనుబంధ సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలపై అధిక పనిభారం మోపడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెండరి ముత్యం, పుండలిక్‌, పిట్టల భీమేష్‌, పిల్లి రమేష్‌, జాదవ్‌ రమేష్‌, శివాజీ, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement