రెండు తలల పాము రూ.కోటి | Two Headed Snake Worth 1Crore | Sakshi
Sakshi News home page

రెండు తలల పాము రూ.కోటి

Oct 7 2026 8:00 AM | Updated on Oct 7 2026 8:00 AM

Two Headed Snake Worth 1Crore

బురద మట్టిలో తిరిగే రెండు తలల పాముపై మూఢ నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ పామును దగ్గర ఉంచుకుంటే అదృష్టం కలిసివస్తుందని కొందరు ప్రచారం చేస్తూ ఎక్కువ ధరలకు అమ్ముతుంటారు. అదే మాదిరిగా ఓ వ్యక్తి బెంగళూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పామును ఇంట్లో ఉంచితే ఊరికే డబ్బులు వచ్చిపడతాయని నమ్మించి ఒక వ్యక్తికి కోటి రూపాయలకు విక్రయించాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రెడ్‌ శాండ్‌ బోవా పామును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సముద్ర గర్భంలో పెరిగే కోరల్‌ రీఫ్స్‌ ని విక్రయించాలని ప్రయత్నిస్తున్న 6 మందిని అరెస్టు చేసి  970 కోరల్‌ రీఫ్‌ ముక్కల్ని సీజ్‌ చేసినట్లు చెప్పారు. 

-బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement