ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత.. సీఈసీ వద్దకు ఎంపీల మార్చ్‌ | Tension prevails in Delhi opposition MPs prepare to meet the EC | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత.. సీఈసీ వద్దకు ఎంపీల మార్చ్‌

Oct 7 2026 3:16 PM | Updated on Oct 7 2026 3:52 PM

Tension prevails in Delhi opposition MPs prepare to meet the EC

ఢిల్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ కార్యాలయాలనికి వెళ్లడానికి విపక్ష ఎంపీలు సిద్ధమయ్యారు. సాగర్‌రత్న హోటల్ వద్ద మూడు బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విపక్ష ఎంపీలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఏర్పాటు చేసిన లంచ్‌ మీటింగ్ ముగిసింది. దీంతో  ఎంపీలంతా ర్యాలీగా బయిలుదేరడానికి సిద్దమయ్యారు. ఈసీ కార్యాలయం వరకూ విపక్ష ఎంపీల మార్చ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో జన్‌పథ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తున్నారని అన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ప్రజల ఓటు హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరును ప్రజల్లోకి తీసుకెళతామని ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 

ఎట్టి పరిస్థితుల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు. నిన్న సీఈసీని కలవడానికి వెళ్తే అడ్డుకున్నారని కాసేపట్లో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగుతామన్నారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ తనకు మెడల్‌తో సమానమని రాహుల్‌ అన్నారు. 

కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నామని ప్రధాని రాజీనామా చేసేంత వరకూ ఉద్యంమం కొనసాగుతుందన్నారు. నిన్నటి మాదిరిగా ఈ రోజు సైతం ఆందోళనలు కొనసాగుతాయన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement