రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
లింగ నిర్ధారణ పరీక్షలు కారణం
తొమ్మిది కేంద్రాల లైసెన్సులు రద్దు
జైపూర్: లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం తొమ్మిది ఏఆర్‌టీ/ఐవీఎఫ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేసింది. ఈ కేంద్రాలన్నీ ఒకే ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇటీవల ఈ ఆసుపత్రి ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో నీలిరంగు లో ఉన్న శిశువుల ఫొటోలు ఉండటంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. నీలి రంగు అనేది మగ శిశువులను ఉద్దేశించిందని, ఆ రంగుతో కూడిన పిల్లల ఫొటోలు పెట్టడం ద్వారా ఆ ఆసుపత్రి పరోక్షంగా లింగనిర్ధారణ చేస్తామని సూచించినట్లు అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు.
ఈ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే సోమవారం తాము చర్యలు తీసుకున్నామని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ తెఇపారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరొగసి సరీ్వసుల నిబంధనలను ఉల్లంఘించినట్ల ప్రాథమికంగా నిర్ధారణ అవడం ఇందుకు కారణమని తెఇలపారు. నీల్‌కాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ తొమ్మిది కేంద్రాలను నడుపుతున్నట్లు తెలిసింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ నియంత్రణ చట్టం 2021 కింద కేంద్రాలపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ గాయత్రీ రాథోర్ తెలిపారు.
ఐవీఎఫ్, ఫెర్టిలిటీ, టెస్ట్‌ట్యూబ్ సరీ్వసులపై ఆ ఆసుపత్రి ఒక ఇంగ్లీషు పత్రిక జైపూర్ ఎడిషన్‌లో ప్రకటన ఇచ్చిందని, ఇందులో నీలిరంగు పిరుదులున్న శిశువుల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రకారం... ఈ నీలి రంగు మగ శిశువును సూచిస్తుంది. ఈ ప్రకటన ద్వారా ఆసుపత్రి లింగ నిర్ధారణ పరీక్షలపై పరోక్ష సంకేతాలిచ్చిందని వివరించారు. చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు సరికాదన్నది తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైన కేంద్రాల్లో భిల్వారాలోని లెవల్–1 ఏఆర్‌టీ క్లినిక్, కోట, ఉదయ్‌పూర్, అజీ్మర్, జోధ్‌పూర్‌లలో ఒకొక్కటి చొప్పున లెవెల్–2 ఏఆర్‌టీ క్లినిక్‌లు ఉన్నాయి. వీటితోపాటు జైపూర్‌లోని మరో ఏఆర్‌టీ లెవెల్–2 క్లినిక్, సరొగసి క్లినిక్, ఏఆర్‌టీ బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి.


