135 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌ల రద్దు  | RBI cancelled the Certificates of Registration of 135 NBFCs | Sakshi
Sakshi News home page

135 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌ల రద్దు 

Jun 11 2026 6:16 AM | Updated on Jun 11 2026 6:16 AM

RBI cancelled the Certificates of Registration of 135 NBFCs

ముంబై: జూపిటర్‌ ఫిన్‌వెస్ట్, ఎస్సెల్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌ లోన్స్‌ సహా 135 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) లైసెన్స్‌లను రద్దు చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందులో మెజారిటీ కంపెనీల రిజిస్టర్డ్‌ కార్యాలయ చిరునామా పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్టు పేర్కొంది. రద్దయిన జాబితాలో ఎక్స్‌ప్రెస్‌ ఫిన్‌క్యాప్‌ హౌస్, అక్షయ్‌ ఫిస్కల్‌ సరీ్వసెస్, టైమ్‌ ఫైనాన్స్, జూపిటర్‌ ప్రాజెక్ట్స్, సిటీవైడ్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కూడా ఉన్నాయి. వ్యాపారం నుంచి వైదొలగడం లేదా వీలీన కారణాలతో 13 సంస్థలు స్వచ్చందంగా తమ సరి్టఫికెట్‌ ఆఫ్‌ రిజి్రస్టేషన్‌ను స్వా«దీనం చేశాయి. ఇలా స్వాధీనం చేసిన సంస్థల్లో జే థామస్‌ ఫైనాన్స్, ఈకాన్‌ సూపర్‌ సేల్స్, హితేష ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్, కార్నెక్స్‌ వినిమయ్, ఇంపాక్ట్‌ లీజింగ్‌ తదితర సంస్థలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement