అమెరికా ఓవరాక్షన్‌.. ఎర్రకోటపై ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | PM Modi Strong Counter To USA Trump | Sakshi
Sakshi News home page

అమెరికా ఓవరాక్షన్‌.. ఎర్రకోటపై ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Aug 15 2025 11:11 AM | Updated on Aug 15 2025 11:54 AM

PM Modi Strong Counter To USA Trump

ఢిల్లీ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికాకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో భారత శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై మోదీ మాట్లాడుతూ.. ‘కొందరు భారత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి. డీజిల్‌, పెట్రోల్‌ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలి. నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోంది అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement