ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు | PM modi Completes Twenty five Years of Public Service | Sakshi
Sakshi News home page

ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు

Oct 7 2026 9:40 AM | Updated on Oct 7 2026 9:41 AM

PM modi Completes Twenty five Years of Public Service

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న శ్రీ వినాయక ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ తర్వాత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా జపాన్ ప్రధాని అభినందనలు తెలిపారు. సామాజిక, జాతీయ అభివృద్ధికి మోదీ తనను తాను అంకితం  చేసుకున్నారని పేర్కొన్నారు. 2001 నుంచి మోదీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.

జపాన్ ప్రధాని జూలైలో తాను భారత్‌లో పర్యటించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ పర్యటన సందర్భంగా తనకు లభించిన స్వాగతానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ ఆహారం, సంగీతాన్ని కూడా ప్రశంసించారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై మోదీతో జరిగిన చర్చలను ఆయన ప్రస్తావించారు.
 

మరోవైపు మోదీ ప్రజా సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘సేవా సంకల్ప యాత్ర’లో భాగంగా గుజరాత్‌లోని వడ్నగర్ నుంచి వారణాసి వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రసంగించనున్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ యాత్ర కొనసాగుతోంది.

ఇదీ చదవండి: Africa: 2,800 ఏళ్ల క్రితమే 20 అంతస్తుల భవనాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement