విజయ్‌ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా? | MK Stalin Doubts TVK Government Survival Beyond 3 Months | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?

Jun 8 2026 5:05 AM | Updated on Jun 8 2026 5:05 AM

MK Stalin Doubts TVK Government Survival Beyond 3 Months

డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ ఎద్దేవా

చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్‌ జోసెఫ్‌ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. 

ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్‌ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్‌ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు.  ఈ  ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement