రేయ్‌ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!! | Massive Python Found Hiding Inside Bakery In Meerut, Rescue Operation Draws Crowd, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రేయ్‌ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!

Jun 15 2026 11:07 AM | Updated on Jun 15 2026 12:08 PM

UP Meerut Shop Surprise Guest Shocks Everyone Viral

బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్‌లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్‌’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్‌లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. 

సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్‌లో షాక్‌లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.

చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement