Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా | Maha Kumbh 2025: Mauni Amavasya Snan crowd 4 times the Population of Delhi | Sakshi
Sakshi News home page

Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా

Jan 29 2025 12:59 PM | Updated on Jan 29 2025 1:13 PM

Maha Kumbh 2025: Mauni Amavasya Snan crowd 4 times the Population of Delhi

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ‍ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు లెక్కలేనంతమంది భక్తులు సంగమ తీరానికి చేరుకున్నారు.

మౌని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే మంగళవారం నాటికే ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం దాదాపు 5.5 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు.

ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడున్న జనాభా.. ఢిల్లీలో ఉంటున్న జనాభాకు నాలుగు రెట్లు అధికంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతమంతా జనసంద్రంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ నగరంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని  అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ అధికారులు 45 ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ, భక్తులు త్రివేణీ సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సంగమ ప్రాంతంలో విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. కుంభమేళా ప్రాంతంలోని భూలా బిస్రా సెంటర్‌లో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.
 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్‌ నిఘా పెంపు

Advertisement
 
Advertisement
Advertisement