
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్ కూతురు హర్షిత తన ఐఐటీయన్ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్ హోటల్‌లో గురువారం కేజ్రీవాల్ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్ హుషారుగా స్టెప్పులేశారు.
#arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU
— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025
జనాల గోల మధ్య కేజ్రీవాల్ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు.
Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu
— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025
పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్ జైన్ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్ హెల్త్ అనే స్టార్టప్‌ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.