Woman sells 8-month-old girl child for Rs 800 - Sakshi
Sakshi News home page

హృదయాల్ని కదిలించే ఘటన: రెండోసారి కూడా ఆడబిడ్డే! భర్తకు తెలియకుండా ఆ తల్లి..

Jul 5 2023 12:41 PM | Updated on Jul 5 2023 2:33 PM

eight month old girl sold couple for rs 800 - Sakshi

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రెండవసారి కూడా కూతురు పుట్టడంతో ఆ తల్లి ఆ నవజాత శిశువుకు రూ.800కు అమ్మేసింది. ఈ విషయం ఆ నవజాత శిశువు తండ్రికి తెలియగానే, అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన  ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మయూర్‌భంజ్‌ జిల్లా ఖూటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహులియా గ్రామంలో చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఆ తల్లి రెండవసారి కూడా తనకు కుమార్తెనే పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీంతో ఆమె రూ.800కు ఆ శిశువును ఒక దంపతులకు విక్రయించింది. ఈ విషయం తమిళనాడులో ఉంటున్న ఆమె భర్తకు తొలుత తెలియలేదు.

తనకు రెండవసారీ కుమార్తెనే పుట్టడంతో ఆ తల్లి ఈ విషయమై ముర్ము అనే వ్యక్తితో చర్చించింది. అతను ఆ నవజాత శిశువును రూ. 800కు విక్రయించేందుకు ఒక దంపతులతో మాట్లాడాడు. ఇంతలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను దీనిపై పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. తాను తమిళనాడు నుంచి వచ్చే సరికి తన చిన్న కుమార్తె ఇంటిలో లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్యను ప్రశ్నించగా జరిగిన సంగతంతా తెలిపిందన్నాడు.

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో శిశువును విక్రయించినవారు, కొనుగోలు చేసినవారు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 

ఇది కూడా చదవండి: హనీమూన్‌లో భర్తకు షాక్‌.. సినిమా మధ్యలో భార్య పరార్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement