కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. కొత్త రూల్‌తో బెనిఫిట్స్‌ జీరో | Central Govt Employees Major Pension Rule Change, PSUs Employees To Lose Retirement Benefits On Dismissal | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. కొత్త రూల్‌తో బెనిఫిట్స్‌ జీరో

May 28 2025 7:24 AM | Updated on May 28 2025 9:21 AM

Central govt employees Major pension rule change PSUs

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ)కు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్‌ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్‌ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతడికి రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందవు. అయితే, సదరు ఉద్యోగి డిస్మిస్‌ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021లో మార్పులు చేసి, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) అమెండ్‌మెంట్‌ రూల్స్‌–2025 తీసుకొచ్చారు.

ఇక, ఈ కొత్త నిబంధనలను ఈ నెల 22న నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దు్రష్పవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్‌ అయినా సరే రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్‌ 31 కంటే ముందు నియమితులైన కేంద ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement