మళ్లీ రూపీ @ 96 | Rupee falls 48 paise to 96. 16 against USA dollar | Sakshi
Sakshi News home page

మళ్లీ రూపీ @ 96

Jul 15 2026 2:03 AM | Updated on Jul 15 2026 2:03 AM

Rupee falls 48 paise to 96. 16 against USA dollar

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 48 పైసలు బలహీనపడి 96.16 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 87 డాలర్లకు చేరింది. 

మరోవైపు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతాయనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఈ అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 95.95 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి, ఒక దశలో ఏకంగా 65 పైసలు క్షీణించి 96.33 వద్ద 
ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement