టోకు ద్రవ్యోల్బణం అప్‌ | India wholesale inflation rises to 9. 87 percent in June on high food prices | Sakshi
Sakshi News home page

టోకు ద్రవ్యోల్బణం అప్‌

Jul 15 2026 12:14 AM | Updated on Jul 15 2026 12:14 AM

India wholesale inflation rises to 9. 87 percent in June on high food prices

న్యూఢిల్లీ: ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్‌లో టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 9.87%గా నమోదైంది. మే నెలలో ఇది 9.68%. 2022–23 బేస్‌ ఇయర్‌గా తాజా గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసింది. మే నెలలో 3.60%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా జూన్‌లో 5.49%కి పెరిగింది.

మినరల్‌ ఆయిల్స్, ఆహార ఉత్పత్తులు, లోహాలు, వివిధ రసాయనాల ఉత్పత్తులు జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఎగియడానికి కారణమని వాణిజ్య, పరిశ్రమల శాఖ వివరించింది. అంతర్జాతీయంగా కమోడిటీలు, క్రూడ్‌ రేట్లు జూన్‌లో కాస్త నెమ్మదించడం వల్ల ఇంధన, విద్యుత్‌ ద్రవ్యోల్బణం తగ్గినట్లు బార్‌క్లేస్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే, పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement