బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోంది: రాహుల్‌ | BJP has been spreading lies about my remarks in America Tour | Sakshi
Sakshi News home page

బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోంది: రాహుల్‌

Sep 22 2024 5:15 AM | Updated on Sep 22 2024 5:15 AM

BJP has been spreading lies about my remarks in America Tour

న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కులను ప్రశ్నించారు. ఎలాంటి భయాలు లేకుండా ప్రతీ ఒక్క భారతీయుడు నచి్చన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ భారత్‌లో ఉండకూడదా? అని రాహుల్‌ అన్నారు.

 నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీ తన నోరు మూయించేందుకు విఫలయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్‌ శనివారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ‘ఎప్పటిలాగే బీజేపీ అబద్ధాలను ఆశ్రయిస్తోంది. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిరాశతో నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌ను నిర్వచించే విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ.. గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను’ అని రాహల్‌ పేర్కొన్నారు. అమెరికాలో సిక్కును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement