నత్తల వేట కోసం వెళ్లి గల్లంతు.. 8మంది మృతి | 8 people died while going snail hunting | Sakshi
Sakshi News home page

నత్తల వేట కోసం వెళ్లి గల్లంతు.. 8మంది మృతి

May 24 2026 7:28 PM | Updated on May 24 2026 7:40 PM

8 people died while going snail hunting

బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో నత్తల వేట కోసం వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతిచెందారు. మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మెుత్తం 11 మంది గల్లంతు కాగా మిగతా వారి కోసం ఆచూకీ కోసం గాలింపులు చేపడుతున్నారు.

మృతులందరూ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపురనదిలో వేటకు నత్తల వేట కోసం వీరంతా నదిలో దిగారు గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతయ్యారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి 8 మంది మృతదేహాలను బయిటకి తీశారు.

మృతులలో ఏడుగురు మహిళలున్నారు. అయితే మిగతా వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది అత్యంత విషాదకరమైన, బాధకరమైన ఘటన అని పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement