● ప్రముఖులకు ఆలయ చైర్మన్ ఆహ్వానం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్న ట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం దేవస్థాన పరిపాలన భవనంలోని చైర్మన్ చాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను క్షేత్రానికి విచ్చేసి స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని కోరుతూ ధర్మకర్తల మండలి తరఫున ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో ని పలువురు ప్రజా ప్రతినిధు లు, ప్రముఖులు, సంఘసేవకులను ఆహ్వానించడం జరగుతుందన్నారు. దాతలను ఆహ్వానించడంలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు.


