లైగింక దాడులు, వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టదా?
నిందితులకు కూటమి నేతల అండదండలు సరికాదు
ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
కూటమి పాలనపై మహిళలు ఆగ్రహం
నంద్యాల: టీడీపీ ప్రభుత్వ తీరు రాక్షస పాలనను తలపిస్తోందని, మహిళలకు భద్రత కరువైందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలకు నిరసనగా మంగళవారం బొమ్మలసత్రంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా జోనల్ మహిళ ఇన్‌చార్జ్ గాజుల శ్వేతా రెడ్డి, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షురాలు హుస్సేనమ్మ, రాష్ట్ర మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ వైస్ ఎంపీపీ పార్వతమ్మ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా.. మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. ఇటీవల గుంటూరు, బద్వేలు ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. అఘాయిత్యాలకు ఒడిగడుతున్న నిందితులకు అధికార పార్టీ నాయకుల అండగ నిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తూ, విచారణలో నిర్లక్ష్యం వహిసున్నార న్నారు. అధికార బలంతో నేరస్తులను కాపాడుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందన్నా రు. నేరస్థులను కఠినంగా శిక్షించకపోతే. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడు లు, అత్యాచారాలు, హత్యలను తక్షణమే అరికట్టాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. మహిళల రక్షణ కోసం పోలీసు స్టేషన్లు, హెల్ప్‌లైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్ధవంతంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షురాలు షాజహాన్, మాజీ కౌన్సిలర్స్ కన్నమ్మ, సావిత్రమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్సార్‌సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, స్టేట్ సెక్రటరీ మధుబాబు, స్టేట్ మైనార్టీ సెల్ సెక్రటరీ ఇక్బాల్, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ నాగేంద్ర, స్టేట్ జనరల్ సెక్రటరీ యూనిస్ బాషా, జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్ రెడ్డి, జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ గగ్గుటూరు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, నాయకులు నాగేంద్ర, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


