రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ (ఎన్‌జీ) కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. సబ్జెక్టుల వారీగా బీబీఏ 2, బయోటెక్నాలజీ 1, బిజినెస్ అనలటిక్స్ 1, వాణిజ్యశాస్త్రం 2, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్ 6, డాటాసైన్స్ 1, అర్థశాస్త్రం 1, ఫైనాన్స్ 1, హిందీ 1, గణితశాస్త్రం 2, భౌతికశాస్త్రం 2, రాజనీతిశాస్త్రం 1, ప్రభుత్వ పాలనాశాస్త్రం 1, స్టాటిస్టిక్స్ 1, తెలుగు 4, ఉర్దూ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతతో పాటు బోధనా అనుభవం ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను 24వ తేదీలోగా కళాశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నవారు 27న ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో జరిగే ఇంటరూ్‌వ్య్‌కు హాజరుకావాలని సూచించారు.
మహిళా డిగ్రీ కళాశాలలో
నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ 5, కామర్స్ 3, తెలుగు 3, జువాలజీ 2, ఫిజిక్స్ 2, బాటనీ 1, మైక్రోబయాలజీ 1, మ్యాథమెటిక్స్ 1, స్టాటిస్టిక్స్ 1, ఎకనామిక్స్ 1, హిస్టరీ (ఉర్దూ మీడియం) 1, పొలిటికల్ సైన్స్ 1, హిందీ 1 మొత్తం పోస్టులు 23 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, 27వ తేదీన ఎన్జీ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
హాలియా డిగ్రీ కళాశాలలో
హాలియా : హాలియాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఘన శ్యామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్– 2, కంప్యూటర్ సైన్స్–1, బోటని–1, జువాలజీ –1, పొలిటికల్ సైన్స్–1 సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈనెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కళాశాల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ తేదీని తరువాత ప్రకటిస్తామని తెలిపారు.


