కనగల్ : మండలంలోని జంగమయ్యగూడెం గ్రామంలో భూ రీ సర్వేను అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా అని సర్పంచ్ నల్లబోతు నిర్మలను అడిగారు. వ్యవసాయ సీజన్ కావడంతో ఉపాధి పనులను నిలిపివేశారని సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో ఏఆర్‌ఐ మర్రి యాదగిరి, సర్వేయర్ మధు, జీపీఓలు పద్మ, సూరారం జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ లతీఫ్ పాల్గొన్నారు.


