జాగ్రత్తలు తీసుకోవాలి..
నల్లగొండ టౌన్ : సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. టైఫాయిడ్, అతిసారా, మలేరియా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఏఏ వ్యాధులు ఎక్కువగా నమోదయ్యాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. జ్వర పీడితులకు అవసరమైన పరీక్షలు చేయటంతో పాటు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ప్రత్యేకంగా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు వారి పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలు అనారోగ్యాల పాలైతే వెంటనే ఆ గ్రామానికి చేరుకుని ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు..
స్లమ్ ఏరియాలను హైరిస్క్ ప్రాంతాలుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రధానంగా రైస్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఎక్కువ కాలుష్యాన్ని వెదజలే పరిశ్రమల ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే నిర్వహిస్తోంది. అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేస్తోంది. అవసరమైతే వారికి వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ అందుబాటులోని వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు.
ఆరు సంవత్సరాలుగా
సీజనల్ వ్యాధుల సంఖ్య ఇలా..
సంవత్సరం డెంగీ మలేరియా చికున్‌గున్యా
2021 57 1 –
2022 136 5 –
2023 241 4 4
2024 357 2 8
2025 45 2 0
2026 13 1 0
మొత్తం 846 14 12
ఫ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ
ఫ కొనసాగుతున్న ఫీవర్ సర్వే
ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఆవరణలో పూల కుండీలు, టైర్లు ఇతర వస్తువుల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు జాలి ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. మూడు రోజులు జ్వరం తగ్గకుండా ఉంటే ఒంటినొప్పులు, నీరసం, కడుపునొప్పి, బీపీ వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి తగిన వైద్య సేవలను పొందాలి. – డాక్టర్ రాహుల్, డీఎంహెచ్‌ఓ


