రామగిరి(నల్లగొండ) : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్ ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా పోరాడుతున్న విద్యార్థి లోకానికి తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ కుట్రలో పాల్గొన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన నిరసనకారులపై పోలీసులు తలలు పగిలేలా లాఠీఛార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. జి.వెంకటేశ్వర్లు, అనంతుల శంకరయ్య మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షల్లో లీకేజీలు జరగడం వల్ల విద్యా వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దర్శనం నర్సింహ, కట్టా అనంతరెడ్డి, గుర్రం వెంకట్‌రెడ్డి, బ్రహ్మచారి, భువనగిరి రవి, నర్సాజి, నాగిరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, కిషోర్‌కుమార్, పందుల సైదులు, అన్నపూసల ఐలేష్, పజ్జూరి స్వామిగౌడ్, శేఖర్, ఎన్.రాములు, సంద యాదయ్య, ఆవుల ప్రేమసుందర్, దున్న లింగస్వామి, బరిగల సైదులు, బి.వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, వెంకట్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, సాయి పాల్గొన్నారు.
ఫ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన


