నల్లగొండ టూటౌన్ : తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీని సోమవారం నల్లగొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాలి మురళి, ఉపాధ్యక్షులుగా సతీష్, ఎస్.నిర్మల, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎం.శ్రీనివాస్, జి.సందీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా నాగయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి.కృష్ణ, జె.నాగరాజు, కోశాధికారిగా హరికృష్ణ, మీడియా కన్వీనర్‌గా కె.రాంబాబు, సహాయ కార్యదర్శిగా జి.సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ను ఎనున్నకున్నారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యానాల శేఖర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు లింగయ్య పాల్గొన్నారు.


