మూసీ మత్స్య సంఘం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మూసీ మత్స్య సంఘం ఎన్నిక

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

నకిరేకల్‌ : మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్‌ సహకార సొసైటీ చైర్మన్‌, ఇతర పదవుల ఎన్నికల ప్రక్రియ సోమవారం ముగిసింది. అలువాల వెంకటస్వామి చైర్మన్‌గా రెండవసారి ఎన్నికయ్యారు. సెక్రటరీ ఇతర పదవులను తన ప్యానెల్‌కు దక్కించుకున్నారు.

13 మంది డైరెక్టర్ల ఎన్నిక

మూసీ మత్స్య సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. మూసీ ప్రాజెక్టు పరిధిలోని నకిరేకల్‌, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 13 డైరెక్టర్‌ పదవులకు గాను 43 మంది పోటీ పడ్డారు. గత నెల 25వ తేదీన నకిరేకల్‌ మండలం ఓగోడులో ఓటింగ్‌ నిర్వహించారు. 13 మంది డైరెక్టర్లుగా విజయం సాధించారు. వీరిలో ఆ సంఘం మాజీ చైర్మన్లు అలువాల వెంకటస్వామి ప్యానల్‌లో ఏడుగురు, సాదుల నర్సయ్య ప్యానల్‌లో ఐదుగురు, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. చైర్మన్‌ పదవిని దక్కించుకనేందుకు రెండు ప్యానళ్లు వ్యూహలు రచించాయి. చైర్మన్‌, ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక కోసం రెండు దఫాలు తేదీలు ప్రకటించినా.. వివిధ కారణాలతో ఎన్నిక వాయిదా పడింది.

బాలెట్‌ పద్ధతిన చైర్మన్‌ ఎన్నిక

నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణంలో సోమవారం మూసీ మత్స్య సంఘం చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. చైర్మన్‌ పదవుల కోసం అలువాల వెంకటస్వామి, సాదుల నర్సయ్య నామినేషన్లు వేయగా రహస్య బ్యాలెట్‌ పద్దతి ద్వారా అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. అలువాల వెంకటస్వామికి ఎనిమిది ఓట్లురాగా.. సాదుల నర్సయ్యకు ఐదు ఓట్లు వచ్చాయి. దీంతో చైర్మన్‌గా అలువాల వెంకటస్వామి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా భూపతి జానకిరాములు, కార్యదర్శిగా అంబటి అంజమ్మ, సభ్యులుగా పేరెల్లి అంజయ్య, గోడ్డెటి చంద్రమ్మ, సాదుల నర్సయ్య, భూపతి శ్రీనివాస్‌, అల్లి రామ్మోహన్‌రాజు, బత్తిని సైదులు, గొడ్డెటి రవి, వెలుగు సైదులు, ఈదుల సరేష్‌, మాద లక్ష్మీనారాయణ నియామకం అయ్యారు. ఎన్నికై న నూతన పాలకవర్గానికి సహకార అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికై న పాలకవర్గం గడువు 2031 జూన్‌ 24వ తేదీ వరకు కొనసాగనుంది.

ఫ చైర్మన్‌గా అలువాల వెంకటస్వామి

ఫ తొమ్మిదేళ్ల తర్వాత పాలకవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement