సమస్యలపై వెంటనే స్పందించాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై వెంటనే స్పందించాలి : కలెక్టర్‌

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

నల్లగొండ : ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వెంటనే స్పందించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలంలో తాగునీరు, వ్యవసాయం తదితర అంశాలపై విపత్తు నిర్వహణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఒకటి, రెండు రోజుల్లోనే 90 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూభారతి దరఖాస్తులను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చాంద్‌పాషా, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడి దేవరాజ్‌ పాల్గొన్నారు.

రీసర్వేలో పారదర్శకత పాటించాలి

నల్లగొండ : ప్రభుత్వం చేపట్టిన భముల రీ–సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ ఉదయాదిత్య భవన్‌లో తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి భూమికి కచ్చితమైన హద్దులు నిర్ణయించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రికార్డులను నవీకరించడమే రీ–సర్వే లక్ష్యమని తెలిపారు. రైతులు, భూ యజమానుల సమక్షంలోనే కొలతలు చేపట్టి, ప్రతి అంశాన్ని వారికి వివరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చాంద్‌ పాషా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తాలుమా, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డీఆర్‌ఓ దశరథ్‌, ల్యాండ్‌ సర్వే ఏడీ దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement