పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయింపు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం ఫ్లైఓవర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కలెక్టర్ ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్ద రావాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఫ్లైఓవర్ పనులు పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాస్తారోకో కారణంగా అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా కంచర్ల భూపాల్‌రెడ్డి నిరాకరించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు అక్కడికి చేరుకొని కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫ్‌లైఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, దీప్లానాయక్, నాయకులు పెరిక కరణ్‌జయరాజ్, గున్‌రెడ్డి యుగందర్‌రెడ్డి, గోపగాని రాజశేఖర్, పెండెం ధనుంజయ్య, మెండు చంద్రశేఖర్‌రెడ్డి, అనిల్‌నాయక్, చెనగోని నాగరాజు పాల్గొన్నారు.
దేవరకొండ : ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని రాస్తారోకో చేసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులను దేవరకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్.. పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బీల్యానాయక్, దేవేందర్, టీవీఎన్ రెడ్డి, సైదిరెడ్డి, ఇలియాస్ పటేల్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


