యూరియా బుకింగ్‌ సమస్యలపై అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

యూరియా బుకింగ్‌ సమస్యలపై అధికారుల విచారణ

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

గట్టుప్పల్‌ : మీసేవ కేంద్రంలో యూరియా బుకింగ్‌ కాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘రూ.10 కట్‌ అవుతున్నా.. యూరియా బుకింగ్‌ కావట్లే’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారి రేవతి, ఏఈఓ రాకేష్‌తో కలిసి స్థానిక మీ సేవ కేంద్రాన్ని సందర్శించి నిర్వహకులు చెరుపల్లి కృష్ణను వివరాలు అడిగి తెలుకున్నారు. రైతుకు సంబందించిన వివరాలు పొందుపరిచి.. ఓటీపీ వచ్చిరాక ముందే యూరియా స్టాక్‌ నిల్‌ అవుతోందని మీ సేవ కేంద్రం నిర్వహకులు అధికారుల దృష్టికి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement