రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం | Newly-Wed couple died in road accident in Nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం

Sep 14 2023 6:38 AM | Updated on Sep 14 2023 10:47 AM

- - Sakshi

నెల రోజుల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటను ఇసుక ట్రాక్టర్‌ మృత్యువు రూపంలో కబళించింది.

నల్గొండ: నెల రోజుల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటను ఇసుక ట్రాక్టర్‌ మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన బుధవారం రాత్రి నకిరేకల్‌ మండలంలోని తాటికల్‌ గ్రామం శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన చిత్తలూరు మహేష్‌(23) అదే గ్రామానికి చెందిన రుషిత(19)ను నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

వారిద్దరు కలిసి బుధవారం సాయంత్రం పల్సర్‌ బైక్‌పై నల్లగొండలోని తమ బంధువుల ఇంటికి వచ్చి వారిని కలిసి పండ్లు తీసుకొని తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరారు. రాత్రి 8.45 గంటల సమయంలో నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. బైక్‌ను నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో మహేష్‌ అక్కడిక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన రుషితను తాటికల్‌ గ్రామస్తులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న నకిరేకల్‌ ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేిశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement