న్యాయస్థానంలో ఆటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

న్యాయస్థానంలో ఆటల పోటీలు

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

రామగిరి (నల్లగొండ) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని (ఆగస్టు 15) పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్‌ పాటిల్‌ ఈ పోటీలను ప్రారంభించారు. రోజువారీ విధినిర్వహణ, కేసుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పోటీల అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్‌ పాటిల్‌, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు, జడ్జి సాయి సేరణ్‌ తేజ్‌ ఇతర సిబ్బందితో కలిసి సరదాగా వాలీబాల్‌ ఆడారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సతీష్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, గేమ్స్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, ఐలేష్‌, మందడి నగేష్‌, జనిగల రాములు, గిరి లింగయ్యగౌడ్‌, కీసర శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, ప్రసాద్‌, నవీన్‌, నిఖిల్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement