సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

చండూరు : ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్రను శుక్రవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి.. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర విధానాల వల్ల పేద ,మధ్య తరగతి ప్రజలపైన తీవ్ర భారం పడుతోందని, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న చైతన్య యాత్రలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు బోయపల్లి భిక్షమయ్య, బోయపల్లి జంగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్‌, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగల వెంకటేశ్‌, కర్నాటి వెంకటేశం, తిప్పర్తి రాములు, జగన్‌, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement