ఏజెన్సీ ఎంపిక వివాదాస్పదం! | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ ఎంపిక వివాదాస్పదం!

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

టెండర్‌ నిబంధనలు ఉల్లఘించారు

నల్లగొండ టూటౌన్‌ : అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని ఎంపిక చేయడంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీని ఎంపిక చేయకుండా.. టెండర్‌ తెరిచి కొన్ని ఏజెన్సీలను తిరస్కరించిన తరువాత మళ్లీ ధ్రువపత్రాలు సమర్పించాలని 20 రోజుల పాటు గడువు పొడిగించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై సమాధానాలు చెప్పకుండా సంబంధిత అధికారులు నీళ్లు నములుతున్నారు. గడువు పొడగింపు ఉద్దేశం వెనుక వారికి అనుకూలమైన ఏజెన్సీ కోసం యూనివర్సిటీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీ అధికారుల తీరు, అక్రమాలపై కొందరు ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఏజెన్సీ ఎంపిక కోసం నోటిఫికేషన్‌..

అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలను ఎంపిక చేయడానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు జూన్‌ 18వ తేదీన టెండర్‌ కం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెండర్‌ వేయడానికి జూన్‌ 27వ చివరి గడువు.. కాగా 10 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల వారు టెండర్లు దాఖలు చేశారు. ఆగస్టు 4వ తేదీన టెండర్లు ఓపెన్‌ చేస్తామని టెండర్‌ దాఖలు చేసిన వారికి యూనివర్సిటీ అధికారులు 3వ తేదీన సమాచారం ఇచ్చారు. మొత్తం 10 మంది టెండర్లు వేయగా అందులో ధ్రువపత్రాలు సరిగా లేవని ముగ్గురి టెండర్లను యూనివర్సిటీ అధికారులు తిరస్కరించారు. మిగిలిన ఏడుగురిలో ఆరుగురు జీఎస్టీకి సంబంధించిన పత్రం పెట్టకపోవడంతో వారికి కూడా అర్హత లేదని సంబంధిత అధికారులు తేల్చేశారు. మిగిలిన ఆ ఒక్క ఏజెన్సీకి అన్ని ధ్రువపత్రాలు ఉన్నట్లు తేల్చారు. కానీ ఆ ఏజెన్సీకి టెండర్‌ ఇవ్వలేదు. దీని వెనుక మంత్రాంగం నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరనే ప్రశ్నలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారిని సన్మానర్గంలో నడిపించాలన్సిన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తీరు మార్చుకోకపోతే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఫ అర్హత లేదని పలు టెండర్లు తిరస్కరించి.. మళ్లీ గడువు పొడిగింపు

ఫ అనుకూల అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కోసం అడ్డదారులు

ఫ ఎంజీ యూనివర్సిటీలో మారని అధికారుల తీరు

యూనివర్సిటీ అధికారులు పెట్టిన నిబంధనలను వారే ఉల్లంఘించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్‌ ఓపెన్‌ చేసిన తరువాత ధ్రువపత్రాలు సమర్పించాలని గడువు పొడిగించడం చట్ట విరుద్ధం. నిబంధనల ప్రకారం నాకే టెండర్‌ ఇవ్వాలి. కొందరు అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం మంచిదికాదు. – చిక్కుళ్ల శంకరయ్య,

శ్రీరామలింగేశ్వర మ్యాన్‌పవర్‌ సప్లయర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement