నల్లగొండ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో చేనేతకు శతాబ్దాల చరిత్ర ఉందని, ఇది కేవలం వ్యాపార వృత్తి మాత్రమే కాకుండా సూక్ష్మ నైపుణ్యం, ఓర్పు, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన గొప్ప కళ అన్నారు. ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్న చేయూత పింఛన్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు, నేతన్నలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సంఘం చైర్మన్ రాపోలు దత్త గణేష్, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ప్రసాద్, యాదగిరి, శ్రీనివాస్, గంజి మురళి, సత్యనారాయణ, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు.


