గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి

Jun 30 2026 3:05 AM | Updated on Jun 30 2026 3:05 AM

కందనూలు: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాలు కృషి చేస్తున్నట్లు జిల్లా సహకార అధికారి రఘునాథరావు అన్నారు. జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో ‘సహకార్‌ సే సమృద్ధి‘ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి సభ్యుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాఖ మానిటరింగ్‌ అధికారి జి.గణేశ్‌, సహకారశాఖ అధికారులు నరేశ్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement