చారకొండ: గీత కార్మికుల రక్షణకు కాటమయ్య కిట్లు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికా రి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. చారకొండ మండల కేంద్రంతోపాటు గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో మంగళవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చారకొండలో కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తయిందన్నారు. త్వరలోనే గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో గీత కార్మికులకు కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కిట్ల వినియోగం, ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి ఇందిర, ఎకై ్సజ్ సీఐ వెంకట్‌రెడ్డి, శిక్షకులు ప్రశాంత్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.


