చిగురించిన ఆయిల్‌ ఆశలు | - | Sakshi
Sakshi News home page

చిగురించిన ఆయిల్‌ ఆశలు

Jul 22 2026 2:05 AM | Updated on Jul 22 2026 2:05 AM

నర్వ: దేశంలో నూనెగింజల ఉత్పత్తి తగ్గటం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా ప్రతిఏటా రూ.70 వేల కోట్ల ఆయిల్‌ను దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ మేర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రారంభంలో ఆసక్తి చూపని రైతులు తదనంతరం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో ముందుకు వస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ఆయిల్‌పాం ధర రూ.24 వేల వరకు పలుకుతుండడంతో సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో..

మొదట్లో పైలెట్‌ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలో 2020–21 ఏడాది ప్రారంభంలో 430 ఎకరాలు మాత్రమే ఆయిల్‌పాం సాగు ప్రారంభించిన అధికారులు 2021లో జిల్లాకు 4.60 లక్షల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 33,999 ఎకరాల్లో విస్తరించగా.. నారాయణపేట జిల్లాలోనే 7 వేల ఎకరాల్లో ఆయిల్‌పాంను రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు గెలలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పర్యటించి రూ.300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించగా.. మరికల్‌ మండలం చిత్తనూర్‌ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం సేకరణలో భాగంగా దాదాపు 40 ఎకరాలు కేటాయింపు కొలిక్కివచ్చింది. కోస్గి, మక్తల్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సైతం సీఎం రేవంత్‌రెడ్డిని కోరడంతో ఆయిల్‌పాం రైతులకు ఆశలు రెట్టింపయ్యాయి.

నారాయణపేట 6,907

వనపర్తి 6,400

30 కి.మీ., ఒకటి చొప్పున..

పంట కోత మొదలైనప్పటి నుంచి కొనుగోలు వరకు అయ్యే రవాణా ఖర్చులను ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషనే చెల్లిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లాలో మక్తల్‌, మరికల్‌, మాగనూర్‌, కృష్ణా, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో

సాగువిస్తీర్ణం

ఇలా (ఎకరాలు)..

‘పేట’ జిల్లాలో మూడు చోట్ల పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు

చిత్తనూర్‌ వద్ద ఆయిల్‌పాం నర్సరీ, పరిశ్రమకు భూమి కేటాయింపు

స్థానికంగా విక్రయించుకుంటేనే రైతులకు ప్రయోజనం

ఇన్నాళ్లు ఫ్యాక్టరీ లేకపోవడంతో గెలల విక్రయానికి అవస్థలు

నాగర్‌కర్నూల్‌

7,692

జోగుళాంబ గద్వాల

7,700

మహబూబ్‌నగర్‌

5,300

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement