జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.


